అయోధ్య రామాలయం కంటే పెద్దదైన సీతామాత ఆలయాన్ని నిర్మిస్తాం: చిరాగ్
- సీతామర్హిలో సీతామాత ఆలయాన్ని నిర్మిస్తాం
- ఎన్నికల్లో గెలవడం ఖాయం
- అధికారంలోకి రాగానే ఆలయానికి శంకుస్థాపన చేస్తాం
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం కంటే పెద్దదైన సీతామాత ఆలయాన్ని నిర్మిస్తామని లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీహార్ లోని సీతామర్హిలో సీతమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. సీత లేకుండా రాముడు సంపూర్ణుడు కాలేడని... అందుకే అయోధ్య రామాలయం కన్నా పెద్దదిగా సీతామాత ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అయోధ్య రామాలయాన్ని, సీతామర్హిలోని సీతమ్మ ఆలయాన్ని కలుపుతూ కారిడార్ నిర్మాణం జరగాలని చెప్పారు.
బీహార్ లో తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని... ప్రభుత్వం రాగానే సీతామాత ఆలయానికి శంకుస్థాపన చేస్తామని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి తలెత్తితే... బీజేపీతో కలసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.