భారత్ మురికి దేశమన్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన బైడెన్
- అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో నోరు పారేసుకున్న ట్రంప్
- మిత్రులపై అలాంటి వ్యాఖ్యలు తగవన్న బైడెన్
- తాను, హారిస్ కలిసి భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆశాభావం
భారత్ మురికి దేశమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్‌లో భాగంగా ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతుండడానికి భారత్, రష్యా, చైనాలే కారణమని ఆరోపించారు. భారత్ మురికి దేశమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా జో బైడెన్ స్పందించారు. మిత్రదేశాలతో అలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వాతావరణ మార్పు వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కరించే మార్గం ఇది కాదని అన్నారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని తాను, కమలా హరిస్ ఎంతో విలువైనదిగా భావిస్తామన్నారు. అప్పట్లో ఒబామా-బైడెన్ ప్రభుత్వ హయాంలో భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలను కొనసాగించామని, అలాగే, బైడెన్-కమలా హారిస్ పాలనతో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో సంబంధాలు కొనసాగిస్తామని బైడెన్ పేర్కొన్నారు.