అమెరికాకు నంబర్ వన్ శత్రువు చైనానే: నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు!

  • ఒబామా, బైడెన్ ఇద్దరూ ఒకటే
  • ఉగ్రవాదులకు నిధులు వెళతాయి
  • మేథో హక్కులను దొంగిలిస్తారు
  • చాటింగ్ ఈవెంట్ లో నిక్కీ హేలీ
చైనాకు మరే దేశం నుంచి అయినా ప్రమాదం ఉందంటే అది చైనా నుంచేనని, చైనా కచ్చితంగా నంబర్ వన్ శత్రువేనని ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మేథో హక్కులను, సంపదను చైనా దొంగిలించకుండా చూడాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని ఆమె అన్నారు. ఫిలడెల్ఫియాలో 'ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్' పేరిట జరిగిన చాట్ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు. ఐరాసలో అమెరికాకు రాయబారిగా పనిచేసిన ఆమె, చైనాను ట్రంప్ అనుక్షణం గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.

"ప్రస్తుతానికి అమెరికాకు తొలి శత్రువు చైనాయే. చైనాతో ఎంతో జాతీయ భద్రత ప్రమాదం నెలకొని వుంది. చైనాను అడ్డుకునేందుకు ట్రంప్ అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి" అని సౌత్ కరోలినా నుంచి రెండు సార్లు గవర్నర్ గా పనిచేసిన ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో డెమోక్రాట్ల తరఫు అభ్యర్థి జో బిడెన్ పైనా విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదానికి బరాక్ ఒబామా ప్రభుత్వంలో నిధులు అందాయని, బైడెన్ గెలిచినా అదే జరుగుతుందని అన్నారు.



More Telugu News