రామ్ 'రెడ్' నుంచి రేపు థ్రిల్లింగ్ అప్ డేట్ వస్తుందట!

  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'రెడ్'
  • వాస్తవానికి ఏప్రిల్ లో విడుదలవ్వాలి  
  • లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కి బ్రేక్
  • రేపు రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం    
ఎటువంటి పాత్రనైనా చాలా ఈజీగా పోషించి మెప్పించగల మన నటులలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఒకరు. ఆమధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం వాస్తవానికి మొన్న ఏప్రిల్ నెలలో విడుదల కావలసి వుంది.

అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడడంతో ఈ చిత్రం విడుదలకి బ్రేక్ పడింది. ఈలోగా తాము డైరెక్ట్ రిలీజ్ చేస్తామంటూ ఓటీటీ సంస్థల నుంచి క్రేజీ ఆఫర్లు వచ్చినప్పటికీ నిర్మాత ఇవ్వలేదు. థియేటర్లలో రిలీజ్ చేయడానికే ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రేపు విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు ఈ చిత్రం నుంచి థ్రిల్లింగ్ అప్ డేట్ ను ఇవ్వనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో ఈ అప్ డేట్ ఏమై ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో విడుదల చేసే డేట్ ను ప్రకటిస్తున్నారా? లేక సినిమాకు సంబంధించిన కొత్త విషయం మరేదైనా వెల్లడించనున్నారా? అన్నది కుతూహలంగా మారింది. నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్లుగా నటించగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.


More Telugu News