పెయిడ్ ఆర్టిస్టులను ఆ ప్రాంత రైతులు పట్టుకున్నారు: వర్ల రామయ్య
- అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులన్నారు
- కానీ.. ప్రభుత్వమే నకిలీ ఉద్యమాలు చేయించడం దుర్మార్గం
- రాజ్యాంగ హక్కును కాల రాసే అధికారం మీకు లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. రాజధాని కోసం ఉద్యమం చేస్తోన్న అమరావతి రైతులను వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులంటున్నారని, కానీ, ఏపీ ప్రభుత్వమే పెయిడ్ ఆర్టిస్టులతో నకిలీ ఉద్యమాలు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
‘ముఖ్యమంత్రి గారూ! అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులని ఊదరకొట్టారు. నిన్న నకిలీ ఉద్యమానికి వస్తున్న పెయిడు ఆర్టిస్టు లను ఆ ప్రాంత రైతులు పట్టుకున్నారు. రచ్చరచ్చ చేశారు. ప్రభుత్వమే నకిలీ ఉద్యమాలు చేయించడం చాలా దుర్మార్గం. రాజ్యాంగ హక్కును కాల రాసే అధికారం మీకు లేదని గ్రహించాలి’ అని వర్ల రామయ్య మండిపడ్డారు.