తెలంగాణలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో అందుబాటులోకి పాల ఏటీఎం
- ఎల్బీనగర్ పరధిలోని హనుమాన్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు
- ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు సేవలు
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరధిలోని ప్రజలకు పాల ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే అవకాశం లభించింది. హస్తినాపురం డివిజన్, హనుమాన్‌నగర్ చౌరస్తాలో ఈ పాల సరఫరా ఏటీఎంను ఏర్పాటు చేశారు. పాల కోసం ఏటీఎంకు వెళ్లేవారు పాత్రను కానీ, సీసాలను కానీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. లీటర్, అర లీటర్, పావు లీటర్ మీట్లను అందులో అమర్చారు.
వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా పాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, డబ్బులను మాత్రం అక్కడే ఉండే సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి పాల ఏటీఎం అయిన దీనిని శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిన్న దీనిని ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఏటీఎం అందుబాటులో ఉంటుందని గుప్తా తెలిపారు.