అలాగా.. 10 కన్నా 19 తక్కువని నాకు తెలియదే!: బీజేపీ హామీపై చిదంబరం వ్యంగ్యం
- 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఆర్జేడీ
- ఎక్కడి నుంచి తెస్తారంటూనే 19 లక్షల ఉద్యోగాలన్న బీజేపీ మేనిఫెస్టో
- ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసిన మాజీ ఆర్థిక మంత్రి
బీహార్ లో ఎన్నికలు జరుగనున్న వేళ, రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ ఇచ్చిన హామీపై అధికార బీజేపీ - జేడీయూ కూటమి విమర్శలు గుప్పించిన వేళ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం సెటైర్లు వేశారు. ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడాన్ని ప్రశ్నిస్తూ, అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించిన బీజేపీ, తన ఎన్నికల మేనిఫెస్టోలో 19 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం స్పందించారు.
"10 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారని ఆర్జేడీని విమర్శిస్తున్న ఎన్డీయే, అదే బీహార్ లో తాము అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలను ఇస్తామని అంటోంది. నాకు తెలియదు. 10 కన్నా 19 అనే నంబర్ చిన్నదని. నేను మళ్లీ ప్రాధమిక విద్యను అభ్యసించేందుకు వెళ్లాలని అనుకుంటున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. మరో ట్వీట్ లో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరేనని మండిపడ్డారు.
ఇటీవల ఓ న్యూస్ ఏజన్సీ నిర్వహించిన పోల్ లో పాల్గొన్న 39 మంది ఆర్థిక వేత్తల్లో 24 మంది భారత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారని చిదంబరం గుర్తు చేశారు. కేంద్రం ప్రకటిస్తున్న ఆర్థిక ఉద్దీపనలు, వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏ మాత్రమూ సరిపోవని వారు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారని, అన్నారు. "ప్రధాని మరియు ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని విన్నారా?" అని ప్రశ్నించారు.