జమ్మూ కశ్మీర్ పతాకం తిరిగొచ్చేంత వరకు జాతీయ పతాకాన్ని ఎగురవేయం: మెహబూబా ముఫ్తీ

  • గృహనిర్బంధం తర్వాత మీడియా ముందుకొచ్చిన మెహబూబా
  • కశ్మీర్ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • తమ రాజ్యాంగాన్ని దొంగిలించారంటూ వ్యాఖ్యలు
పద్నాలుగు నెలల నిర్బంధం అనంతరం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. జమ్మూ కశ్మీర్ పతాకంతో పాటు తమ రాజ్యాంగం, ఆర్టికల్ 370 కింద ప్రత్యేక ప్రతిపత్తి తిరిగొచ్చేంతవరకు జాతీయ జెండా ఎగురవేయబోనని స్పష్టం చేశారు. తాము కశ్మీర్ కాడి వదిలేశాం అని భావిస్తున్నవాళ్లు పొరబడుతున్నట్టేనని అన్నారు. మా రాజ్యాంగ పరమైన హక్కులను దొంగిలించారంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా తిరిగి సాధించేంత వరకు రాజ్యాంగపరమైన పోరాటాన్ని కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.

"జమ్మూ కశ్మీర్ లో జాతీయ పతాకం ఉందంటే అందుకు కారణం మా పతాకం, మా రాజ్యాంగం వల్లే. దేశంలోని మిగతా భూభాగంతో మేం అనుసంధానమయ్యాం అంటే అందుకు కారణం మా పతాకమే" అని వివరించారు. అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు ఎన్నికల్లో పోటీచేయబోనని వెల్లడించారు. మా సొంత రాజ్యాంగం పరిధిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News