జగన్ ను పిలిపించి మోదీ మాట్లాడారు.. అయినా విఫలమయ్యారు: సోము వీర్రాజు
- వరద పరిస్థితిపై మోదీ, అమిత్ షా మాట్లాడారు
- నష్టాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది
- సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం
ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. వరద నష్టాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. వరద బాధితులకు తక్షణ సాయం కూడా అందించలేకపోయారని విమర్శించారు. జగన్ ను ఢిల్లీకి పిలిపించి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరదల గురించి మాట్లాడారని... అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని అన్నారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర మంత్రితో తాము మాట్లాడామని వీర్రాజు చెప్పారు. తమ పార్టీకి చెందిన నాలుగు బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారని తెలిపారు. నష్టపోయిన రైతులకు పూర్తి సహాయసహకారాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.