వారాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

  • 127 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 34 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు లాభపడ్డ మారుతి సుజుకి
నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ కోలుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 252 పాయింట్ల వరకు లాభపడింది. అయితే, ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో... లాభాలు కొంతమేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 40,685కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 11,930కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (4.44%), టాటా స్టీల్ (3.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.31%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.03%), బజాజ్ ఆటో (2.46%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-2.36%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.62%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.73%), ఇన్ఫోసిస్ (-0.72%).


More Telugu News