కొండచరియలు విరిగిపడ్డా అమ్మవారి అనుగ్రహంతో ప్రమాదం జరగలేదు: చిన్నజీయర్ స్వామి
- కనకదుర్గమ్మను దర్శించుకున్న చిన్నజీయర్ స్వామి
- స్వామికి ఘనస్వాగతం పలికిన ఆలయ వర్గాలు
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చిన్నజీయర్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఇంద్రకీలాద్రిని దర్శించారు. ఆయనకు ఆలయ ఈవో సురేశ్ బాబు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం సందర్భంగా చిన్నజీయర్ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
దర్శనం అనంతరం మాట్లాడుతూ, సీఎం జగన్ పర్యటనకు ముందు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్పందించారు. కొండచరియలు విరిగిపడినా అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్ లోనే కరోనా వ్యాక్సిన్ తయారు కావాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. వ్యాక్సిన్ ప్రయత్నాలు సఫలం కావాలని, భారత్ తిరిగి శక్తిమంతమైన దేశంగా వెలుగొందాలని అమ్మవారిని ప్రార్థించానని వెల్లడించారు.