వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదు: నారా లోకేశ్

  • రైతే రాజు అని చెప్పుకుని అధికారంలోకి వచ్చారు  
  • ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలి
  • పంట నష్టపోయిన రైతుకు రూ. 25వేల పరిహారం ఇవ్వాలి
రైతే రాజు అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ... ఇప్పుడు  రైతాంగాన్ని విస్మరిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను రైతు లేని రాష్ట్రంగా మారుస్తోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లను బిగిస్తే ఉద్యమం తప్పదని... ఇదే తన హెచ్చరిక అని అన్నారు. తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని చెప్పారు. వేరుశనగ రైతులకు రూ. 2 వేల కోట్ల పంట నష్టం జరిగితే... ఇప్పటి వరకు రూ. 25 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారని విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 25 వేలు ఇవ్వాలని అన్నారు.


More Telugu News