యూనిఫామ్ ఉందని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకూడదు: డీజీపీ మహేందర్ రెడ్డి
- ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న మహేందర్ రెడ్డి
- శిక్షణను పూర్తి చేసుకున్న 1,162 మంది ఎస్సైలు
- నిజాయతీగా విధులను నిర్వహించాలన్న డీజీపీ
సమాజంలో పోలీస్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈరోజు ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. మొత్తం 1,162 మంది ఎస్సైలు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సేవకు అంకితం కావడానికి ఇది ప్రభుత్వం కల్పించిన అవకాశం అని చెప్పారు.
రాగద్వేషాలకు అతీతంగా... నిజాయతీగా, నిష్పక్షపాతంగా, చట్ట ప్రకారం విధులను నిర్వహించాలని డీజీపీ అన్నారు. యూనిఫామ్ ఉంది కదా అని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకూడదని... అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా విధులను నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.