నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన కథానాయిక

  • కథానాయికగా రాణించిన మమత మోహన్ దాస్
  • కేన్సర్ తో పోరాడి విజయం సాధించిన వైనం 
  • తొలిచిత్రాన్ని మలయాళంలో నిర్మిస్తున్న మమత  
మన కథానాయికలు తమకి డిమాండు ఉన్నంత కాలం హ్యాపీగా నటించేస్తూ సంపాదించుకుని వెళ్లిపోతారు. అయితే, కొందరు కథానాయికలు నిర్మాతలుగా మారడం కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అయితే, ఇలా నిర్మాతలుగా మారే కథానాయికలు చాలా తక్కువగా వుంటారు. వ్యాపారంలోకి దిగి రిస్క్ చేసే వాళ్లు అరుదుగా వుంటారు. ఇప్పుడు మమత మోహన్ దాస్ కూడా అలా రిస్క్ చేస్తూ నిర్మాతగా మారింది.

మొదట్లో చిత్రసీమకు గాయనిగా పరిచయమై.. తదనంతర కాలంలో ఆమె తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్.. వంటి పలు సినిమాలలో కథానాయికగా నటించి, గ్లామర్ గాళ్ గా పేరుతెచ్చుకుంది. అయితే, కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉండగా కేన్సర్ సోకడంతో పెద్ద పోరాటమే చేసింది. చివరికి కేన్సర్ ని జయించి మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చింది.

ఈసారి నిర్మాతగా అడుగేస్తోంది. తొలిసారిగా మలయాళంలో ఓ చిత్ర నిర్మాణాన్ని చేబట్టింది. ఆమె నిర్మించే తాజా సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. 'మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. చిత్ర పరిశ్రమ నుంచి తాను ఎంతో పొందానని, తాను కూడా ఈ పరిశ్రమకు ఎంతో కొంత ఇవ్వాలని అనుకుంటున్నానని మమత చమత్కరించింది.


More Telugu News