స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ అన్నీ పోర్న్ హబ్స్ తప్ప మరేమీ కావు: కంగన
- థియేటర్ లో చూసే వాటిగా సినిమాలను కాపాడుకోవాలి
- ఓటీటీ స్ట్రీమింగ్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
- ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమవుతుంది
ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు గుప్పించింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అన్నీ పోర్న్ హబ్స్ తప్ప మరేమీ కావని ఆమె మండిపడింది. 'ఈరోస్ నౌ' సంస్థ సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినాకైఫ్ లతో ఉన్న మీమ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత వాటిని తొలగించింది. అయితే వీటి స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ కంగన ఫైర్ అయింది.
థియేటర్ లో మాత్రమే చూసే వాటిగా సినిమాలను కాపాడుకోవాలని కంగన తెలిపింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓటీటీ స్ట్రీమింగ్ నుంచి థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడం కష్టమవుతుందని చెప్పింది. డిజిటైజేషన్ తో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయని తెలిపింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అన్నీ పోర్న్ హబ్ లేనని వ్యాఖ్యానించింది.