అజాగ్రత్తగా ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదు: సీసీఎంబీ

  • దేశంలో కరోనా కేసులు మాత్రమే తగ్గాయి
  • కరోనా తీవ్రత తగ్గిందని చెప్పలేము
  • వ్యాక్సిన్ రావడానికి ఏడాది కాలం పట్టొచ్చు
సీసీఎంబీ సీఈవో మధుసూదన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో కరోనా కేసులు మాత్రమే తగ్గాయని... మహమ్మారి తీవ్రత తగ్గిందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కును కచ్చితంగా ధరించాలని సూచించారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కరోనా వ్యాక్సిన్ రావడానికి ఏడాది కాలం పట్టొచ్చని చెప్పారు. త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో మధుసూదన్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ టీకా లండన్, బ్రెజిల్ లో వికటించింది. టీకా వేసుకున్న ఒక వాలంటీర్ చనిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.


More Telugu News