ఆదుకుంటామని కేంద్రం చెప్పిన తర్వాతే జగన్ మేల్కొన్నారు: విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

  • వరదల నుంచి ప్రజలను కాపాడటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది
  • వరద ప్రాంతాల్లో మంత్రులు తిరిగిన దాఖలాలు లేవు
  • దేవాలయాల నిధులను ఇష్టం వచ్చినట్టు తరలిస్తున్నారు
భారీ వరదల నుంచి ప్రజలను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం జాగ్రత్త చర్యలను తీసుకోలేకపోయిందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు తిరిగిన దాఖలాలు లేవని చెప్పారు.

రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్రం ప్రకటించిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ మేలుకున్నారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీకి ఇచ్చినంత ప్రాధాన్యతను ప్రజాసమస్యలకు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... గుడులకు పైసా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. హిందూ దేవాలయాల నిధులను ఇష్టం వచ్చినట్టు తరలిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News