కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా?: దేవినేని ఉమ

  • సొంత ప్రయోజనాలకోసం రివర్స్ టెండరింగ్ 
  • పోలవరం "అంచనాలు" రివర్స్
  • ఖర్చుపెట్టిన నిధులు తెచ్చుకోలేకపోతున్నారు 
కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చుకోలేకపోతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. పోలవరం అంచనాలను సొంత ప్రయోజనాల కోసం రివర్స్ చేశారని ఆయన మండిపడుతూ ట్వీట్ చేశారు.

‘సొంత ప్రయోజనాలకోసం రివర్స్ టెండరింగ్ తో పోలవరం "అంచనాలు" రివర్స్ చేశారు. చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీకమిటీ(టీఏసీ) ఆమోదంతెస్తే,  28 మంది ఎంపీలుండి కూడా తెలుగు దేశం పార్టీ  ఖర్చుపెట్టిన నిధులు తెచ్చుకోలేక  కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడతారా? ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.


More Telugu News