తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580
  • 2,06,105 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,292
  • ప్రస్తుతం 20,183 మందికి కరోనాకు చికిత్స  
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,717 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,06,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,977 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 254 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 98 కేసులు నిర్ధారణ అయ్యాయి.
         
    


More Telugu News