బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం

  • తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం
  • పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే అవకాశం
  • పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు చాన్స్
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ విషయాన్ని వెల్లడించిన వాతావరణ శాఖ, ఇది ప్రస్తుతం వాయవ్య దిశగా వెళుతోందని, వచ్చే రెండు రోజుల్లో ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

అయితే, తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండగా, దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపారు. దీంతో వచ్చే రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని హెచ్చరించారు.


More Telugu News