కేంద్రం వాటా ఉన్న ఏ ఒక్క పథకానికీ ప్రధాని పేరు రాయడంలేదు: ఏపీ సర్కారుపై రఘురామకృష్ణరాజు ధ్వజం
- వైఎస్సార్ బీమా పథకంపై రఘురామ స్పందన
- ఇది పాత పథకమేనని వెల్లడి
- పేరు మార్చారని వ్యాఖ్యలు
- ఏపీ పథకాల్లో ప్రధాని పేరు, ఫొటో ఏవన్న రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్న ఏ ఒక్క పథకంలోనూ ప్రధాని పేరు రాయడంలేదని అన్నారు. తాజాగా వైఎస్సార్ బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి పథకానికి వాటా ఇచ్చే కేంద్రం వైఎస్సార్ బీమా పథకానికి మాత్రం వాటా ఇవ్వలేదని వైసీపీ సర్కారు చెప్పుకుంటోందని అన్నారు. కానీ గతంలో కేంద్రం వాటా ఇచ్చిన పథకాలకు ప్రధానమంత్రి పేరు, ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
అయినా, వైఎస్సార్ బీమా పథకం కొత్తదేమీ కాదని, గతంలో ఉన్న పథకానికే పేరు మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న రఘురామకృష్ణరాజు... ఈ విషయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రూపంలో తెలియజేసినట్టు వెల్లడించారు. ఏపీ సీఎం రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలతో పార్టీ కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని తెలిపారు.