నాయిని కోసం ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్... భోరున విలపించిన నాయిని కుటుంబసభ్యులు

  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని
  • నాయిని కుటుంబ సభ్యులను ఓదార్చిన వైనం
  • ఇటీవలే న్యూమోనియాకు గురైన నాయిని
తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థత కారణంగా హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం అపోలో ఆసుపత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. సీఎం కేసీఆర్ ను చూడగానే నాయిని కుటుంబ సభ్యులు బాధను ఆపుకోలేకపోయారు. భోరున విలపించారు. సీఎం కేసీఆర్ వారిని ఓదార్చారు.

నాయిని ఆరోగ్యం విషయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడాయన శరీరం చికిత్సకు స్పందించడంలేదని తెలుస్తోంది. నాయిని నర్సింహారెడ్డి గతనెలలో కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే నాయినిని టీఆర్ఎస్ ముఖ్యనేతలు పరామర్శించారు.


More Telugu News