ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్... అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
- సంప్రదాయ వేషధారణలో సీఎం జగన్
- పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వర్గాలు
- కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
- ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు!
ఏపీ సీఎం జగన్ విజయవాడ కనకదుర్గమ్మకు ఈ సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి తరలివెళ్లారు. సీఎంకు దుర్గమ్మ ఆలయ వేదపండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టు, తలపాగా ధరించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సీఎం వెంట మంత్రి కొడాలి నాని, శాసనసభ్యులు వల్లభనేని వంశీ, పార్థసారథి కూడా ఉన్నారు.
కాగా, ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తన పర్యటన సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సందర్భంగా సీఎం జగన్ ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు.