ఇలాంటి నిబంధన ఏ ప్రభుత్వమైనా పెడుతుందా?: దేవినేని ఉమ
- సాయం పొందాలంటే వారం ముంపులో మునగాలట
- ఔదార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా?
- అపార నష్టానికి 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?
- మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు
కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ లో వరద సహాయక చర్యలు సరిగ్గా తీసుకోవట్లేదంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. సాయం చేయడంలో చాలా జాప్యం చేస్తున్నారని, రూ.500 ఇచ్చి సరిపెడుతున్నారని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
‘సాయం పొందాలంటే వారం ముంపులో మునగాలన్న నిబంధన ఏ ప్రభుత్వమైనా పెడుతుందా? ఔదార్యం చూపాల్సిన చోట షరతులు విధిస్తారా? అపార నష్టానికి 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? మంత్రులను బాధితులు నిలదీస్తున్నారని ముఖ్యమంత్రి గాల్లో ప్రదక్షిణలు చేశాడంటున్న చంద్రబాబు నాయుడి మాటలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్’ అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేశ్ తో పాటు పర్యటించిన తమ పార్టీ నేతలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.