వచ్చే ఎన్నికల్లో పోటీకి శశికళ ప్లాన్.. కేవియట్ పిటిషన్‌తో మార్గం క్లియర్ చేసుకునే యత్నం

వచ్చే ఎన్నికల్లో పోటీకి శశికళ ప్లాన్.. కేవియట్ పిటిషన్‌తో మార్గం క్లియర్ చేసుకునే యత్నం
  • జైలు శిక్ష పునస్సమీక్షపై కేవియట్ దాఖలుకు రెడీ
  • తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికల్లో పోటీ
  • జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టుకు
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఎన్నికల బరిలో దిగేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి నాలుగేళ్లు జైలు శిక్ష పడిన చిన్నమ్మకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదు. అయితే, వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదల కాబోతున్న శశికళ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన న్యాయవాది రాజా చెందూర్ పాండియన్‌కు ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగు చూసింది.

అక్రమాస్తుల కేసులో ఒకే కోణంలో విచారణ జరిగిందని, కాబట్టి అన్ని కోణాల్లోనూ విచారణ జరగడంతోపాటు శిక్షను కూడా పునస్సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు శశికళ తరపు న్యాయవాది రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని న్యాయవాదులతో దినకరన్, శశికళ న్యాయవాది సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె విడుదల తర్వాత ఈ పిటిషన్‌ వేస్తారని, తీర్పు అనుకూలంగా వస్తే కనుక ఎన్నికల్లో పోటీ చేస్తారని  అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు తెలిపాయి.


More Telugu News