దేశంలో కరోనా అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో ఐదు ఏపీ జిల్లాలు!
- దేశంలో 30 జిల్లాల్లో కరోనా ఉద్ధృతం
- తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, బెంగాల్ లో అధిక కేసులు
- దేశంలో ఇప్పటివరకు 76 లక్షల కేసులు
భారత్ లో ఇప్పటివరకు 76 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 67 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం 1.15 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్రం దేశంలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ఏపీకి చెందిన ఐదు జిల్లాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 30 జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈ రాకాసి వైరస్ కోరలు చాస్తోందని గుర్తించారు.
మొత్తం 30 జిల్లాల జాబితా ఇదే...

- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- గుంటూరు
- ప్రకాశం
- చిత్తూరు
- చెన్నై
- తిరువళ్లూరు
- కోయంబత్తూరు
- చెంగల్పట్టు
- సేలం
- పుణే
- నాగ్ పూర్
- ఠాణే
- అహ్మద్ నగర్
- ముంబయి
- తుముకూరు
- మైసూర్
- బెంగళూరు అర్బన్
- దక్షిణ కన్నడ
- హసన్
- 24 ఉత్తర పరగణాలు
- 24 దక్షిణ పరగణాలు
- హుగ్లీ
- హౌరా
- కోల్ కతా
- త్రిసూర్
- తిరువనంతపురం
- కోజికోడ్
- ఎర్నాకుళం
- మళప్పురం