భారత్, అమెరికా, జపాన్ నౌకాదళ విన్యాసాల్లో పాలుపంచుకోనున్న ఆస్ట్రేలియా... స్పందించిన చైనా

  • మలబార్ విన్యాసాల పేరిట భారత్, అమెరికా, జపాన్ నేవీ విన్యాసాలు
  • మార్పును గమనించామన్న చైనా
  • శాంతికి దోహదపడేలా ఉండాలంటూ వ్యాఖ్యలు
ప్రతి ఏడాది నౌకాదళ విన్యాసాల పేరిట భారత్, అమెరికా, జపాన్ సముద్ర జలాల్లో తమ యుద్ధ పాటవాన్ని, సన్నద్ధతను చాటుకోవడం తెలిసిందే. అయితే ఈ ఏడాది నిర్వహిస్తున్న మలబార్ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా నేవీ కూడా పాలుపంచుకుంటోందని భారత్ ప్రకటించింది. బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలోనూ నిర్వహించే తాజా మలబార్ విన్యాసాలు చైనాకు హెచ్చరికలు జారీ చేయడానికే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై చైనా స్పందించింది.

"ఈ మార్పును మేం గమనించాం" అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ఓ ప్రకటనలో తెలిపారు. "దేశాల మధ్య సైనిక సహకారం ప్రాంతీయ సామరస్యతకు, స్థిరత్వానికి దోహదపడేలా ఉండాలన్నదే మా ఆకాంక్ష" అని లిజియాన్ పేర్కొన్నారు. పైకి ఇలా వ్యాఖ్యానిస్తున్నా, తాజాగా నిర్వహిస్తున్న మలబార్ విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తనను కట్టడి చేయడానికేనని చైనా అనుమానిస్తోంది.


More Telugu News