తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల సాయం ప్రకటించిన మమతా బెనర్జీ
- భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ అతలాకుతలం
- సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు
- మమతా బెనర్జీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్
వరద బీభత్సంతో చిన్నబోయిన హైదరాబాద్ నగరం, ఇతర తెలంగాణ జిల్లాల పరిస్థితి పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదారంగా స్పందించి కోట్ల రూపాయలు అందించారు.
తాజాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ రూ.2 కోట్లు విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఎంతో పెద్ద మనసుతో స్పందించిన మమతా బెనర్జీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దీదీకి ఫోన్ చేసి, ఎంతో సహృదయతో సాయం ప్రకటించారంటూ ఆమెను కేసీఆర్ కొనియాడారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్విట్టర్ లో వెల్లడించింది.