రైతు వ్యతిరేక చట్టాలకు జగన్ మద్దతు పలికారు: శైలజానాథ్ విమర్శలు
- వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం కలుగుతుంది
- జగన్ రైతుల వ్యతిరేకి
- వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ బిల్లులను దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, రైతులు ఉద్యమిస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాల సేకరణను చేపట్టామని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలకు మద్దతు పలికిందని విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లులకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై ఆయన మండిపడ్డారు. జగన్ రైతుల పక్షపాతి కాదని... రైతు వ్యతిరేకి అని అన్నారు. ప్రధాని మెప్పు కోసం జగన్ ఆరాటపడుతున్నారని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టే వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు.