చెన్నైలో కుమరన్ సిల్క్స్ కు పోటెత్తిన జనం.... దుకాణం సీల్ చేసిన అధికారులు
- పండుగ సీజన్ లో షాపింగ్ కు ఉత్సాహం చూపుతున్న జనాలు
- కిటకిటలాడిన చెన్నై కుమరన్ సిల్క్స్
- భౌతికదూరం పాటించకుండా షాపింగ్
- చర్యలు తీసుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు
ఇది పండుగల సీజన్. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమయంలో ఎంతో హడావుడి కనిపిస్తుంది. ఈ క్రమంలో చెన్నైలోని కుమరన్ సిల్క్స్ వస్త్ర దుకాణానికి జనం విరగబడ్డారు. కరోనా మహమ్మారి పొంచి ఉన్న తరుణంలోనూ లెక్కచేయకుండా షాపింగ్ చేసేందుకు భారీగా తరలివచ్చారు. చెన్నై త్యాగరాయనగర్ లో ఉన్న ఈ ప్రముఖ వస్త్రదుకాణం లోపల తిరునాళ్ల వాతావరణం కనిపించింది.
భౌతికదూరం సంగతి అటుంచితే కొందరు ముఖాలకు మాస్కులు కూడా లేకుండా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కుమరన్ సిల్క్స్ దుకాణానికి సీల్ వేశారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.