కొవిడ్-19 కేంద్రంలో గాబ్రా డ్యాన్స్ చేసిన కరోనా రోగులు, వైద్యులు.. వీడియో వైరల్
- ముంబైలోని గొరేగావ్ లో వైరల్
- కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు డ్యాన్స్
- మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రయత్నం
ముంబైలోని గొరేగావ్ లోని కొవిడ్-19 చికిత్స కేంద్రంలో డాక్టర్లు, రోగులు కలిసి గాబ్రా డ్యాన్స్ చేశారు. చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు ఈ డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది.
కరోనా రోగుల్లో కొందరు ఈ డ్యాన్స్ చేయగా మరికొందరు మంచాలపైనే కూర్చొని చూశారు. కొవిడ్ కేంద్రాల్లో కరోనా రోగులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా వారితో చెస్, క్యారం వంటి ఆటలు కూడా ఆడిస్తున్నారు. దేశంలోని అనేక కరోనా కేంద్రాల్లో వారితో డ్యాన్సులు కూడా చేయిస్తున్నారు. వారితో పాటు వైద్య సిబ్బంది కూడా డ్యాన్సు చేస్తూ ఉత్సాహపరుస్తున్నారు.