పండుగ వేళ టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. 3 వేల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి
- ఇప్పటికే రోడ్డుమీది కొచ్చిన ప్రత్యేక బస్సులు
- ఈ నెల 24 వరకు సేవలు
- అడ్వాన్స్ బుకింగు చేసుకోవాలని సూచన
దసరా పండుగ వేళ ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని తట్టుకునేందుకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే రోడ్డుమీదికొచ్చిన ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 24 వరకు సేవలు అందించనున్నాయి. అయితే, ఇవన్నీ జిల్లాలకే పరిమితమని అధికారులు తెలిపారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులకు అడ్వాన్స్ బుకింగు కూడా అందుబాటులో ఉందని, పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది.