మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సాయం చేయాలి: మంత్రి తలసాని

  • వరద పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణం
  • కేంద్రం తక్షణమే సాయం చేయాలి
  • నష్టపరిహారాన్ని రేపటి నుంచి అందిస్తాం
గతంలో పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాదులో వరదలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చెరువులు, నాలాలపై ఇళ్ల నిర్మాణాలు తమ ప్రభుత్వ హయాంలో జరిగినవి కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని అన్నారు. కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మొత్తం తిరిగారని... వరద బాధితుల సహాయార్థం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని... తక్షణ సహాయం కింద నిధులను విడుదల చేయాలని చెప్పారు. నీతి ఆయోగ్ నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరుగుతున్నా... తాము కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నామని తెలిపారు. వరద బాధితులకు నష్టపరిహారాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు.


More Telugu News