వరద బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం ‌

  • వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన జగన్
  • వరద బాధితులను గుర్తించాలని ఆదేశం
  • రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వాలన్న సీఎం
వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఏరియల్ సర్వే చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అవనిగడ్డ, పెనమలూరు, నందిగామ, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జగన్ వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు.

అనంతరం అధికారులతో వరద పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను తక్షణమే గుర్తించి వారికి నష్ట పరిహారం అందించాలని ఈ సందర్బంగా సీఎం ఆదేశించారు. పంట నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలను పూర్తి చేయాలని చెప్పారు. రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని అందించాలని ఆదేశించారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీని ఇస్తే... రబీ సీజన్ లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని చెప్పారు.


More Telugu News