కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ కుమారుడికి కరోనా... వాయుమార్గంలో హైదరాబాద్ తరలింపు

  • 23 రోజులుగా కరోనాతో బాధపడుతున్న గోపాల్
  • హైదరాబాదులో ఊపిరితిత్తులు మార్పిడి చేసే అవకాశం
  • గోవింద్ కర్జోల్ కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింగ్ కర్జోల్ కుటుంబంలో మొత్తం ఎనిమిది మందికి కరోనా సోకగా, పెద్ద కుమారుడు డాక్టర్ గోపాల్ కర్జోల్ (43) తప్ప అందరూ కోలుకున్నారు. గోపాల్ కర్జోల్ గత మూడు వారాలకు పైగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంతకీ కుదుటపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం వాయుమార్గంలో హైదరాబాద్ తరలించారు.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గోవింద్ కర్జోల్ తో పాటు పలువురు మంత్రులు కరోనా బారినపడ్డారు. డిప్యూటీ సీఎం కర్జోల్ 19 రోజల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన భార్య కూడా ఇటీవలే కరోనా నయం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, గోవింద్ కర్జోల్ తనయుడు గోపాల్ కు హైదరాబాదులో ఊపిరితిత్తుల మార్పిడి చేస్తారని తెలుస్తోంది.


More Telugu News