మరో మలయాళం రీమేక్ లో మోహన్ బాబు!
- 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' రీమేక్
- గతేడాది కేరళలో దీనికి మూడు రాష్ట్ర అవార్డులు
- కీలక పాత్రలో మోహన్ బాబు నటించే అవకాశం
- ఇప్పటికే రెండు రీమేక్ లలో నటిస్తున్న చిరంజీవి
ఏ భాషలో మంచి సినిమా వచ్చినా మన హీరోలు వదలరు. వెంటనే హక్కులు తీసుకుని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చిరంజీవి అలాగే ఒక మలయాళ చిత్రాన్ని, ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ఈ కోవలో చేరుతున్నారు. ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారు.
గతేడాది నవంబర్లో మలయాళంలో 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' అనే సినిమా వచ్చింది. సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సైన్టిఫిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
నూతన దర్శకుడు రతీశ్ బాలకృష్ణన్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.