భారత్ లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ భారీ కుట్ర: కేంద్ర నిఘావర్గాల వెల్లడి
- భారత్ ను అస్థిరపరచాలన్న లక్ష్యంతో పాక్ కుతంత్రాలు
- పీఓకేలో రెండుసార్లు సమావేశమైన ఐఎస్ఐ, ఉగ్రనేతలు
- ఉగ్రదాడులకు భారీ ఒప్పందాలు
భారత్ ను అస్థిరపరచాలన్న లక్ష్యంగా పాకిస్థాన్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఉగ్రవాద మార్గం ప్రధానమైనది. తాజాగా భారత్ లో ఉగ్రదాడులకు పాక్ భారీ కుట్రకు పాల్పడుతోందన్న విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రదాడులే లక్ష్యంగా పాక్ ఇంటెలిజెన్స్, ముష్కర మూకలు పథకం పన్నినట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.
పీఓకేలో పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల నేతలు రెండుసార్లు సమావేశమైనట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రెండు సమావేశాలు ఈ నెల మొదటివారంలోనే జరిగినట్టు తెలుసుకున్నారు. అక్టోబరు 4,7 తేదీల్లో పీఓకేలో ఐఎస్ఐ, ఉగ్రనేతల కదలికలను నిఘా వర్గాలు పసిగట్టాయి. శీతాకాలానికి ముందే ఉగ్రవాదులు పథకం రూపొందించినట్టు తేలింది. కేంద్ర నిఘా వర్గాల తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నిఘా వర్గాల నివేదిక ప్రకారం... ఒక్కోదాడికి రూ.26 లక్షల చొప్పున ఒప్పందం కుదిరింది. పెద్ద ఆపరేషన్లకు రూ.30 లక్షలు విడిగా చెల్లించేలా ఐఎస్ఐ, ఉగ్రవాదులు ఓ అవగాహనకు వచ్చారు. ఈ పన్నాగంలో భాగంగా భారత్ లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడేలా సరిహద్దుల వెంబడి పాక్ ఆర్మీ ప్రయత్నం చేస్తుంది. ఎల్ వోసీ వద్ద లాంచ్ ప్యాడ్ ల ద్వారా చొరబడేలా పన్నాగం పన్నారు. నీలం లోయ సమీపంలో తంగ్ధర్ సెక్టార్ వద్ద చొరబాట్లకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు వెంబడి ఓ పాక్ గ్రామంలో ఉగ్రవాద కదలికలు అధికం అవడాన్ని నిఘా వర్గాలు తీవ్రంగా పరిగణించాయి.