వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం జగన్
- ఈ మధ్యాహ్నం సీఎం జగన్ సర్వే
- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద తీరు పరిశీలన
- 2 లక్షల ఎకరాల్లో పంటనష్టం!
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అస్తవ్యస్తం అయ్యాయి. రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద తీరును పరిశీలించనున్నారు.
కాగా, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగినట్టు తెలుస్తోంది. 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అంచనా. వరద తగ్గుముఖం పట్టాక పూర్తిస్థాయిలో పరిశీలిస్తే పంటనష్టంపై మరింత స్పష్టత రానుంది. కృష్ణా జిల్లాలో 44 వేల హెక్టార్లలో పత్తి, 1100 హెక్టార్లలో చెరుకు బాగా నష్టపోయాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంచనాకు అందని రీతిలో పంటనష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.