మొదట బాగా ఆడి చివర్లో ఓడిపోతున్నాం.. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు: వార్నర్
- అబుదాబిలో నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్
- ఓడిపోయిన సన్ రైజర్స్
- మూడు మ్యాచుల్లో విజయం దాకా వచ్చి ఓడాం
- నిన్న మొదట బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే
అబుదాబిలో నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. దీనిపై హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. మొదట మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినప్పటికీ ముగింపులో మాత్రం తమ జట్టు విఫలమవుతోందని చెప్పాడు. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని తెలిపాడు.
తాము చివరి మూడు మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయామని చెప్పాడు. నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని తాను అనుకుంటున్నానని తెలిపాడు. దుబాయ్‌తో పోల్చితే అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనదే అయినప్పటికీ, ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారిందని తెలిపాడు. విలియమ్సన్ గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడని చెప్పాడు.