పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.. బస్సులో ఉన్న 16 మందీ దుర్మరణం
- ప్రయాణికులతో రోండూ నుంచి రావల్పిండి బయలుదేరిన బస్సు
- గిల్గిత్-బాల్టిస్థాన్ మార్గంలో ఘటన
- రాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగిన సహాయక చర్యలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దారుణం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రోండూ నుంచి 18 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి ఓ బస్సు రావల్పిండి బయలుదేరింది.
మార్గమధ్యంలో ఇద్దరు ప్రయాణికులు వారి గమ్యస్థానం వద్ద దిగిపోగా, మిగతా 16 మందితో బస్సు బయలుదేరింది. బస్సు గిల్గిత్-బాల్టిస్థాన్ మార్గంలో ప్రయాణిస్తుండగా బస్సుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శనివారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు సహాయక చర్యలు కొనసాగాయి.