చివర్లో పట్టు వదిలిన బౌలర్లు... సన్ రైజర్స్ టార్గెట్ 164 రన్స్
- అబుదాబిలో సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
- కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు
- చివరి 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చిన సన్ రైజర్స్
కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో 16 ఓవర్ల వరకు మెరుగైన ప్రదర్శన కనబర్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఆ తర్వాత పట్టు సడలించారు. దాంతో కోల్ కతా బ్యాట్స్ మెన్ విలువైన పరుగులు జోడించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా స్కోరు 4 వికెట్లకు 111 పరుగులు కాగా, ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు వచ్చాయి. మొత్తమ్మీద కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
చివర్లో దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 29 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతగా ఆడి 34 రన్స్ నమోదు చేశాడు. అంతకుముందు ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాటి 23 పరుగులు చేయగా, నితీశ్ రానా 29 పరుగులు జోడించాడు. ఆండ్రీ రసెల్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బాసిల్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.