పంటపొలాల్లో దిగిన హెలికాప్టర్... ముప్పు తప్పించుకున్న ప్రముఖ జ్యుయెలరీ సంస్థల అధినేత
- కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న హెలికాప్టర్
- హెలికాప్టర్ లో ఎస్వీఎన్ జ్యుయెలరీ అధినేత కుటుంబం
- పొగమంచులో చిక్కుకున్న హెలికాప్టర్
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో తమిళనాడు భూభాగంలోని పంట పొలాల్లో ఓ హెలికాప్టర్ దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ ఎస్వీఎన్ జ్యుయెలరీ సంస్థల అధినేత శ్రీనివాసన్ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లాలని నిర్ణయించుకుని కోయంబత్తూరు నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆ హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లు, శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. అయితే గాల్లోకి లేచిన హెలికాప్టర్ ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ వద్ద ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది.
తిరుపత్తూరు జిల్లా గగనతలంలో ఉన్నట్టుండి పొగమంచు కమ్మేయడంతో హెలికాప్టర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పైలెట్లు విఫలయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపత్తూరు జిల్లా నంగిలి వద్ద పొలాల్లో దింపేశారు. హెలికాప్టర్ సురక్షితంగా కిందికి దిగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. కాసేపటి తర్వాత వాతావరణం కుదుట పడడంతో హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి తిరుపతి దిశగా పయనమైంది.