చంద్రబాబు ఇంటిని ముంచాలని కుతంత్రాలు చేస్తున్నారు: అయ్యన్నపాత్రుడు

  • ఎంత వరద వస్తుందో అంచనా వేసి గేట్లు ఎత్తాలన్న అయ్యన్న
  • విమర్శిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • విజయసాయి 6 వేల ఎకరాలు కబ్జా చేశారంటూ వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వైసీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. అమరావతిలో చంద్రబాబు ఇంటిని ముంచడానికి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నదికి ఎంత వరద వస్తుందో అంచనా వేసి గేట్లు ఎత్తాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దాడులకు పాల్పడుతున్నారని అయ్యన్న మండిపడ్డారు. వరదలు వస్తే సీఎం ఒక్కసారి కూడా ఏరియల్ సర్వే నిర్వహించలేదని విమర్శించారు. లంక గ్రామాలు మునిగిపోతే రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కనీసం మీడియా సమావేశం పెట్టలేని సీఎం ఈ రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించడంలేదని తెలిపారు. విశాఖలో ప్రేమ సమాజం భూములు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని అయ్యన్న వ్యాఖ్యానించారు. విశాఖలో 6 వేల ఎకరాలకు పైగా విజయసాయిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రిపై చర్యలు తీసుకోలేదని, మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఎం జవాబు చెప్పాలని నిలదీశారు.


More Telugu News