వినూత్న రీతిలో వంతెనపై పెళ్లి చేసుకున్న అమెరికా అమ్మాయి, కెనడా అబ్బాయి... కారణం ఇదే!
- కరోనా కాలంలోనూ ఒక్కటైన జంట
- కరోనా నేపథ్యంలో కెనడా నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు
- సరిహద్దుల్లోని వంతెనపై వివాహం చేసుకున్న జంట
‘కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు’ అంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఓ జంట పెళ్లి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. వధువు లిండ్సేది అమెరికాలోని మేన్ ప్రాంతం. వరుడు అలెక్స్ కెనడాకు చెందిన అబ్బాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా నుంచి కెనడాకు ప్రజలు రాకుండా సరిహద్దుల వద్ద నిబంధనలు విధించారు.
అయినప్పటికీ, ఈ నిబంధనలు వారిద్దరి పెళ్లిని అపలేదు. అమెరికా,కెనడా సరిహద్దుల్లో నదిపై ఉన్న వంతెనపైనే వారు పెళ్లి చేసుకున్నారు. పడవల్లో 30 మంది బంధుమిత్రులతో కలిసి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు.
ఆ సమయంలో సరిహద్దు ప్రాంతంలో వంతెనపై పెళ్లి చేసుకోగా, లిండ్సే తల్లితండ్రులు మాత్రం అమెరికా వైపున పడవమీద కూర్చుని ఈ పెళ్లిని చూశారు. ఇందుకోసం అధికారుల నుంచి వారు ముందే అనుమతి తీసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పెళ్లి చేసుకోవడానికి అధికారులు ఒప్పుకున్నారు.