ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్ల నియామకం.. కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
- 139 బీసీ కులాలకు గాను ప్రస్తుతం 56 కార్పొరేషన్ల ఏర్పాటు
- ప్రతి కార్పొరేషన్ కు ఛైర్మన్, 12 మంది డైరెక్టర్ల నియామకం
- తాడేపల్లిలో వివరాలను ప్రకటించిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ లో బీసీల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈరోజు వీటకి సంబంధించిన పాలకమండళ్లను ప్రకటించారు. 139 బీసీ కులాలకు గాను ప్రస్తుతం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్ కు ఛైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను నియమించారు. అంతేకాదు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను తాడేపల్లిలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ తదితరులు ప్రకటించారు.
బీసీ కార్పొరేషన్లు, ఛైర్మన్ల వివరాలు ఇవే:
బీసీ కార్పొరేషన్లు, ఛైర్మన్ల వివరాలు ఇవే:
- రజక: రంగన్న (అనంతపురం)
- కురుబ: కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం)
- తొగట కార్పొరేషన్: గడ్డం సునీత (అనంతపురం)
- కుంచిటి వక్కలిగ: డా. నళిని (అనంతపురం)
- వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)
- పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)
- ముదళియర్: తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)
- ఈడిగ: కె. శాంతి (చిత్తూరు)
- గాండ్ల: భవానీప్రియ (తూ.గో)
- పెరిక: పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)
- అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో)
- అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)
- షేక్:షేక్ యాసీన్ (గుంటూరు)
- వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)
- కుమ్మరి శాలివాహన: పురుషోత్తం (గుంటూరు)
- కృష్ణ బలిజ/పూసల: కోలా భవానీ (గుంటూరు)
- యాదవ: హరీష్‌కుమార్ (కడప)
- నాయీబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)
- పద్మశాలి: విజయలక్ష్మి (కడప)
- నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్ బి (కడప)
- సాగర ఉప్పర: గనుగపేట రమణమ్మ (కడప)
- విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
- గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
- వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)
- భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)
- వాల్మీకి బోయ: డా. మధుసూదన్ (కర్నూలు)
- కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)
- వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)
- ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)
- జంగం: ప్రసన్న (నెల్లూరు)
- బొందిలి: కిషోర్ సింగ్ (నెల్లూరు)
- ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
- చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)
- ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం)
- దేవాంగ: సురేంద్రబాబు (ప్రకాశం)
- మేదర: లలిత నాంచారమ్మ (ప్రకాశం)
- కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
- కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)
- రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
- పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)
- కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం)
- శ్రీసైన: చీపురు రాణి ( శ్రీకాకుళం)
- మత్స్యకార: కోలా గురువులు (విశాఖ)
- గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
- నగరాల: పిల్లా సుజాత (విశాఖ)
- యాత: పి.సుజాత (విశాఖ)
- నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
- తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
- కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు (విజయనగరం)
- శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
- దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
- సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)
- శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)
- అత్యంత వెనుకబడిన వర్గాలు: వీరన్న (ప.గో)
- అతిరస: ఎల్లా భాస్కర్‌రావు (ప.గో)