భార్య, ప్రియురాలితో కలిసి ఏపీలోని ఆలయాల్లో చోరీలు.. అరెస్టు
- నిందితుడు అనంతపురం జిల్లా వాసి
- అనంతపురంలో 11, ప్రకాశంలో రెండు ఆలయాల్లో చోరీలు
- రూ.12.30 లక్షల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం
భార్య, ప్రియురాలితో కలిసి ఏపీలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఎరుకలి నల్లబోతుల నాగప్ప అలియాస్ రాజు అలియాస్ నాగరాజు (42) అని పోలీసులు గుర్తించాారు. అతడు మహానంది మండలం గాజులపల్లికి చెందిన తన ప్రియురాలు లావణ్య అలియాస్ సుధతో పాటు భార్య ప్రమీల (33)తో కలిసి ఈ చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వారు ముగ్గురు కలిసి కడప జిల్లాలో నాలుగు, అనంతపురంలో 11, ప్రకాశంలో రెండు ఆలయాల్లో చోరీలు చేశారని చెప్పారు. వారి నుంచి మొత్తం రూ.12.30 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు, 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.23,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో కలకలం రేపిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ఎర్రగుంట్లలోని శ్రీకృష్ణ మందిరంలోనూ చోరీలు చేసింది వీరేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.