ఎన్నికల మహిమ!.... దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జో బైడెన్

  • అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి
  • ట్రంప్, బైడెన్ హోరాహోరీ
  • చెడుపై మంచి గెలవాలన్న బైడెన్
అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల కోలాహలం పతాకస్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా డెమొక్రాట్ల తరఫున జో బైడెన్ బరిలో ఉన్నారు. ట్రంప్ కంటే ప్రచారంలో బైడెనే దూసుకెళ్లుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల ఓట్లను రాబట్టుకోవడంపై జో బైడెన్ మొదటినుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యక్షురాలి పదవి కోసం భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ను రంగంలో దింపారు.

ఇక అసలు విషయానికొస్తే... జో బైడెన్ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. "హిందువులు జరుపుకునే నవరాత్రులు మొదలయ్యాయి. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఈ పండుగ జరుపుకునే వారందరికీ నేను, జిల్ బైడెన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరోసారి చెడుపై మంచి గెలవాలని, మెరుగైన భవిష్యత్తు దిశగా శుభోదయం జరగాలని, అందరికీ అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాం" అంటూ జో బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News