పోలీసును కొట్టిన కేసు.. మహారాష్ట్ర మహిళా మంత్రికి జైలు శిక్ష! 

  • ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసులో తీర్పు
  • మంత్రితో పాటు మరో ఇద్దరికి శిక్ష
  • హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పిన మంత్రి
మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు యశోమతి ఠాకూర్ కి అమరావతి కోర్టు మూడు నెలల జైలు శిక్షను విధించింది. దీనికి తోడు రూ. 15 వేల జరిమానా విధించింది. డ్యూటీలో ఉన్న ఒక పోలీసు చెంపపై కొట్టడంతో ఆమెపై కేసు నమోదైంది.

ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలోని అమరావతిలో అంబాదేవి దేవాలయానికి యశోమతి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఆమెతో పాటు డ్రైవర్, మరో ఇద్దరు అనుచరులు కూడా ఉన్నారు. పోలీసులపై వారు కూడా చేయి చేసుకున్నారు. బాధిత పోలీసు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంత్రితో పాటు ఇతర నిందితులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మంత్రి చెప్పారు.


More Telugu News