ఏపీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల... కనిపించని మునుపటి ఉద్ధృతి
- గత 24 గంటల్లో 70,881 వేల కరోనా టెస్టులు
- 3,676 పాజిటివ్ కేసులు వెల్లడి
- 24 మంది మృతి
- తాజాగా 5,529 మందికి కరోనా నయం
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి గణనీయమైన స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితుల్లో, ఏపీలో మాత్రం క్రమంగా శాంతిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గడచిన కొన్నివారాలుగా కరోనా గణాంకాలు పరిశీలిస్తే మునుపటి ఉద్ధృతి కనిపించకపోవడాన్ని గమనించవచ్చు.
తాజాగా ఏపీలో 70,881 నమూనాలు పరీక్షించగా, 3,676 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 567 పాజిటివ్ కేసులు రాగా, అత్యల్పస్థాయిలో కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 91 కేసుల చొప్పున వచ్చాయి. గత 24 గంటల్లో ఏపీలో 24 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించారు. తాజాగా 5,529 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,79,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,35,638 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 37,102 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మరణాల సంఖ్య 6,406కి పెరిగింది.