ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా నుంచి రానున్న మోషన్ పోస్టర్!
- ‘రాధే శ్యామ్’ నుంచి అప్ డేట్ ఇచ్చిన సినిమా యూనిట్
- ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు
- 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో పోస్టర్ విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘రాధే శ్యామ్’ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనుంది.
ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోంచి ఇప్పటికే రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రభాస్, పూజ హెగ్డేల రొమాంటిక్ పోస్టర్ ను మొదట విడుదల చేశారు.
అనంతరం ఇటీవలే పూజ హెగ్డే పుట్టినరోజు వేడుక జరుపుకున్న సందర్భంగా ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆమె స్టిల్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని ఈ సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.